వచ్చే సంవత్సరం చివరిలో ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ 100వ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుకు తన 100వ సినిమాను దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని సమాచారం  ఫిలింనగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం బాలయ్య 100వ సినిమాలో ఒక పత్యేక పాత్రలో నటించడానికి పవన్ అంగీకరించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రాధమికంగా పవన్, బాలయ్యల మధ్య ఒక ప్రాధమిక సమావేశం ఏకాంతంగా జరిగిందని టాక్. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పవన్ కు అత్యంత సన్నిహితుడు పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తాడని టాక్. రాబోయే సంవత్సరాంతానికి పవన్ తాను నటించబోయే ‘గబ్బర్ సింగ్ 2’ విడుదల కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి 2016 సంవత్సరంలో తాను నటించబోయే ఒక భారీ మల్టీ స్టారర్ గా పవన్ బాలయ్యల సినిమా ఉంటుంది కాబట్టి వర్గాలకు అతీతంగా తాను నిజమైన టాలీవుడ్ ఎంపరర్ అని నిరూపించుకోవదానికే పవన్ బాలయ్య కోరికను తీరుస్తున్నాడు అని అనుకోవాలి.  ఇప్పటికే బాలయ్య 100వ సినిమా కథ గురించి ఆలోచన చేస్తున్న స్క్రిప్ట్ రైటర్స్ కు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక పాత్ర తన 100వ సినిమాలో సృస్టించ వలసినదిగా స్పష్టంగా బాలయ్య చెప్పినట్లు సమాచారం. ఈ వార్తలే నిజం అయితే 2016 లో బాలకృష్ణ క్రియేట్ చేయబోయే కలెక్షన్స్ సునామీకి పవన్ సహాయ సహకారాలు బాలయ్యకు అందడంతో మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది అనుకోవాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: