టాలీవుడ్ జక్కన రాజమౌళి నిన్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి అనేక ఆ శక్తికర విషయాలను తెలియచేస్తూ తాను దర్శకత్వం వహించి రవితేజాకు బ్లాక్ బస్టర్ హిట్ గా మారిన ‘విక్రమార్కుడు’ సినిమా పై సంచలన కామెంట్స్ చేసాడు రాజమౌళి.  తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘వికమార్కుడు’ సినిమాను హిందీలో ఎందుకు రీమక్ చేయలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తాను అదో గొప్ప సినిమాగా ఫీల్ అవడంలేదని అందువల్లనే అది దేశానికి తెలియచేయవలసిన గొప్ప సినిమా అని ఫీల్ అవ్వలేదు కాబట్టే తాను హిందీలో రీమేక్ చేయలేదు అంటున్నాడు రాజమౌళి  అదీకాకుండా ఈ సినిమా వల్ల తనకన్నా ఎక్కువ లాభ పడింది రవితేజా అని అంటూ ఈ సినిమా రవితేజా కెరియర్ కు ఒక స్టార్ వెహికల్ గా ఉపయోగ పడింది అని కామెంట్ విసిరాడు రాజమౌళి. ఇదే సినిమాలో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచిన ‘చిo తా తా ఛి తా త’ ట్యూన్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో సూపర్ హిట్ ట్యూన్ గా నిలిచినా ఈ ట్యూన్ తమిళనాడులోని ఒక జానపద పాటలోని బాణీ నుండి కీరవాణి తీసుకున్నాడని చెపుతూ అనుసరణకు కాపీ చేయడానికి చాల తేడా ఉంది అని అంటూ ఇది అవగాహన లేకపోవడంతో చాలామంది విమర్శకులు ప్రతి అనుసరణను కాపీగా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయ పడ్డాడు రాజమౌళి.  తాను తీసిన ‘మర్యాదరామన్న’ 1923లో విడుదలైన మూకీ సినిమా ‘అవర్ హాస్పిటాలిటీ’ సినిమాకు అనుసరణ అని చెపుతూ ఒక మంచి ఐడియా అనుసరించడం కాపీ కాదు అంటూ ఎన్నో విషయాలను తెలియచేసాడు ఈ జక్కన్న..

మరింత సమాచారం తెలుసుకోండి: