రజినీకాంత్ పుట్టినరోజు డిసెంబరు 12న విడుదల కాబోతున్న ‘లింగ’ పై చాల ఆసలు పెట్టుకుంది అనుష్క. అయితే అనుష్క ఆశలను సోనాక్షి దెబ్బ తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాలో పేరుకు ఇద్దరు హీరోయిన్స్ అయినా కథ మొత్తంలో సోనాక్షి పాత్రకు ఉండే ప్రాముఖ్యత అనుష్కకు ఉండదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్స్, ప్రోమోలతో పాటు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన రెండు పాటలలో కూడా సోనాక్షి సిన్హాకు ఇచ్చిన ప్రాముఖ్యత అనుష్కకు ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కథకు సంబంధించి గ్రామీణ యువతీ పాత్రలో నటించిన సోనాక్షి ఈ సినిమాలోని రజినీకాంత్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర అవడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో రజినీతో పాటు వచ్చే ప్రముఖ పాత్ర కావడంతో సోనాక్షికే ఎక్కువ ప్రాముఖ్యత ఈ సినిమాలో లభించింది అని టాక్.  ఇక ఆధునిక యువతిగా అనుష్క కనిపించబోతున్న ఈ సినిమాలో రజినీకాంత్ కు తన గతాన్ని కనెక్ట్ చేసే పాత్రగా మాత్రమే అనుష్క మిగిలి పోతుంది కాబట్టి సినిమా చూసే ప్రేక్షకులలో సోనాక్షి పాత్రకు వచ్చే ప్రసంసలు అనుష్కకు రావు అని అంటున్నారు. గతంలో కూడా సూర్య నటించిన ‘సింగం 2’ విషయంలో కూడా అనుష్క కంటే ఆ సినిమాలో నటించిన హన్సికకు మంచి పేరు వచ్చినట్లే అదే చరిత్ర పునరావృతమై అనుష్క ఆశలను సోనాక్షి దెబ్బ తీస్తుంది అనే కథనాలు కోలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తూ అనుష్కకు టెన్షన్ ను క్రియేట్ చేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: