ప్రభాస్ మళ్ళీ ‘బాహుబలి’ సినిమా షూటింగ్ కోసం బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ కొండ పై రానాతో యుద్ధాలు చేస్తున్న సన్నివేశాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఫైటింగ్ సీన్స్ పూర్తి కాగానే మళ్ళీ వచ్చే నెలనుండి ‘బాహుబలి’ లోని తన తండ్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు.  దీనికోసం మళ్ళీ ప్రభాస్ తన గడ్డాన్ని వత్తుగా పెంచుకోవడమే కాకుండా మళ్ళీ 120 కేజీల భారీ శరీరంగా తన లుక్ ను పెంచుకోవడానికి భారీ కసరత్తుల బాట పట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత జులైలో ప్రభాస్ కు ‘బాహుబలి’ షూటింగ్ సందర్భంలో ప్రమాదం జరిగి సర్జరీ జరిగిన నేపధ్యంలో ప్రభాస్ ను ఈ పాత్ర కోసం జిమ్ లో భారీ కసరత్తును చేసే విషయంలో అదేవిధంగా భారీ బరువులు ఎత్తే విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ప్రభాస్ డాక్టర్స్ గతంలో సూచించినట్లు టాక్. ఆ సలహాల నేపధ్యంలో ప్రాభాస్ తన తండ్రి పాత్ర కోసం అవసరమైన భారీ విగ్రహాన్ని తిరిగి పొందడానికి అతి జాగ్రత్తలు తీసుకుంటూ తన వ్యక్తిగత జిమ్ లో భారీ కసరత్తును మొదలు పెట్టాడని టాక్. ప్రభాస్ పడుతున్న కష్టానికి వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ‘బాహుబలి’ ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: