ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ పవన్ అభిమానులకు క్షమార్పణ చెప్పవలసిన సంఘటన లేటెస్టుగా జరిగింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సక్సస్ మీట్ కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినప్పుడు కొందరు పవన్ వీరాభిమానులు తమకు పవన్ కళ్యాణ్ సెల్ నెంబర్ కావాలి అని దిల్ రాజ్ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చారని తెలుస్తోంది.  ఆ ఒత్తిడి భరించలేక దిల్ రాజ్ పవన్ అభిమానులకు తన దగ్గర ఉన్న ఒక సెల్ నెంబర్ ఇచ్చి ఇదే పవన్ సెల్ నెంబర్ చెప్పి అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు అని టాక్. అయితే ఆ ఫోన్ నెంబర్ చెప్పే క్రమంలో ఒక అంకె తప్పుగా చెప్పాడని సమాచారం. అయితే తమ చేతికి వచ్చిన సెల్ నెంబర్ నిజంగా పవన్ దే అని భావించిన పవన్ వీరాభిమానులు ఆ ఫోన్ నెంబర్ కు వరస పెట్టి ఫోన్స్ చేయడం మొదలు పెట్టారట.  అయితే ఆ ఫోన్ నెంబర్ కలిగిన అసలు వ్యక్తి తనకు వరుస పెట్టి వస్తున్న ఫోన్స్ కు విపరీతంగా కోపగించి పవన్ అభిమానుల పై కోపగిం చాడని టాక్. జరిగిన ఈ విషయం దిల్ రాజ్ దృష్టికి రావడంతో పొరపాటు జరిగింది. ఒక నెంబరుకు బదులు మరొక నెంబర్ ఇచ్చాను అంటూ పవన్ అభిమానులకు క్షమార్పణ చెప్పడమే కాకుండా ఆ ఫోన్ నెంబర్ వ్యక్తికి కూడా దిల్ రాజ్ క్షమార్పణలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దిల్ రాజ్ కావాలని ఇలా తప్పు నెంబర్ ఇచ్చాడా? లేదంటే నిజంగానే పొరపాటు జరిగిందా అంటూ రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: