ఈ శుక్రువారం విడుదల కాబోతున్న ‘రఫ్’ సినిమా ప్రమోషన్ గురించి ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా గురించి అనేక ఆశక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. తాను ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలకంటే ముందుగానే గత సంవత్సరం జనవరిలో ఈ ‘రఫ్’ సినిమా ప్రారంభం అయింది అని చెపుతూ అప్పట్లో తాను సంతకం పెట్టిన మొట్టమొదటి సినిమా ‘రఫ్’ కావడంతో సినిమా షూటింగ్ స్పాట్ లో చాల బెదురుగా ఉండే దాన్ని అని అంటూ దాదాపు నెలరోజులు తనకు ఇక్కడ వాతావరణం చాల కొత్తగా అనిపిమచిందని చెప్పుకొచ్చింది రకుల్.  తాను ఈ సినిమాలో నటించడానికి వచ్చిన రెండవ రోజునే ఈ సినిమాలో నటిస్తున్న కమెడియన్ ధన్ రాజ్ ను చేతితో కొట్టవలసిన సీన్ చిత్రీకరిస్తూ ఉండటంతో తాను ధన్ రాజ్ ను విసురుగా కొట్టడానికి భయపడినా తనను గట్టిగా కొట్టమని ధన్ రాజ్ పదేపదే అడగడంతో గట్టిగా ఒక పీకు పీకితే ధన్ రాజ్ కు దిమ్మతిరిగే షాక్ తన చేయి ఇచ్చిందని చెపుతూ ఆ సీన్ తలుచుకున్నప్పుడల్లా తనకు నవ్వు వస్తుందని అంటూ అప్పటి సంఘటనను గుర్తుకు చేసుకుంది రకుల్ .  మూడు వరుస హిట్స్ తరువాత రకుల్, మూడు వరుస పరాజయాల తరువాత ఆది కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తే అది రుకుల్ క్రేజ్ వల్ల మాత్రమే  సాధ్యం అని ఏకంగా ఈ సినిమాలో నటిస్తున్ను హీరో ఆది ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు అంటే నేటి యంగ్ హీరోలకు రకుల్ అదృష్ట దేవతలా ఎలా మారిపోయిందో అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: