పవన్ అభిమానులు రేపటి ఉదయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పవన్ ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ రేపు దర్శనం ఇస్తుంది. అయితే ఈ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాకుండానే సినిమా ఆడియో ఫంక్షన్ డేట్ నిశ్చయం అయింది అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ గోపాలుడి ఆడియో రజినీకాంత్ పుట్టినరోజు ‘లింగ’ విడుదలరోజు అయిన డిసెంబర్ 12న ముహూర్తం కుదిరింది అని అంటున్నారు. జూనియర్ ‘టెంపర్’ ఆడియో వేడుక డిసెంబర్ 14న జరగబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎట్టి పరిస్తుతులలోను ‘టెంపర్’ ఆడియో వేడుక కంటే ముందుగానే గోపాలుడి పాటల హడావిడి మొదలవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మాతలు ఈ డేట్ ను నిర్ణయించి నట్లు వార్తలు వస్తున్నాయి.  రేపు విడుదలయ్యే ఫస్ట్ లుక్ తో హడావిడిని మొదలపెట్టబోతున్న ‘గోపాల గోపాల’ వార్తల హంగామా సంక్రాంతి పండుగ ముగిసే వరకు ఎదో రూపంలో సందడి చేస్తూనే ఉంటాడు గోపాలుడు. అయితే ఈరోజు నుంచి మొదలు పెట్టిన టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె మరో వారం రోజులలో ఎటువంటి పరిష్కారం జరగకుండా కొనసాగితే దీని ప్రభావం ఇంకా షూటింగ్ పూర్తి కావలసిన ‘గోపాల గోపాల’ విడుదల పై స్పష్టంగా ఉంటుంది అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: