యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ టెంపర్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన న్యూస్ పై అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా టెంపర్ మూవీలో షర్ట్ లెస్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ని నిమ్మకూరులో నిర్వహిస్తున్నాడనే న్యూస్ ఇండస్ట్రీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చలకు కారణంగా మారుతుంది. అయితే తన ఆడియో ఫంక్షన్ రచ్ఛగా మారటానికి వీలులేకుండా ఉండటానికి, తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి టెంపర్ చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో ఆడియో విడుదల జరగనుందని సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. మొదట టెంపర్ ఆడియోని నిమ్మకూరులో నిర్వహించటానికి ఒప్పుకున్న ఎన్టీఆర్, తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో తన మూవీ ఆడియో ఫంక్షన్ ని నిర్వహిస్తే, కొద్ది ప్రమోషన్ కూడ అయ్యే ఛాన్స్ ఉంటుందనే ఉద్ధేశంతోనే ఈ విదమైన నిర్ణయాన్ని జూనియర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి జోడి కట్టింది. ఇటివలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపటి నుండి కొన్ని రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2015 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: