టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గోపాల గోపాల. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ గోపాల గోపాల మూవీకి సంబంధించిన ఎటువంటి ఫస్ట్ లుక్ బయటకు రాలేదు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది అందరి ఆసక్తిగా మారింది. మరి కొద్ది రోజుల్లోనే అందరి ఊహాగానాలకి తెరపడనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 28న రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్దం చేసారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం గోపాల గోపాల ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ రూం నుండి అందరూ ఏకగ్రీవంతో ఈ గోపాల గోపాల మూవీ ఫస్ట్ లుక్ సూపర్బ్ అంటూ కితాబు ఇచ్చేశారు. అంతే కాకుండా గోపాల గోపాల ఫస్ట్ లుక్ ని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూసి, చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంట. గోపాల గోపాల ఫస్ట్ లుక్ ని చూసిన ఓ ప్రొడ్యూజర్, పవన్–వెంకీలను బాగా డిజైన్ చేసారని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీ పెద్దల నుండి ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఫస్ట్ లుక్ పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’, ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతోంది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున ఈ సినిమాని డి. సురేష్ బాబు-శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ నుండి అందిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అందరి ప్రశంశలను పొందిన ఈ ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే నవంబర్ 28 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: