త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న అల్లుఅర్జున్ లేటెస్ట్ మూవీలో తనకు అవకాశం వస్తుందని ఎన్నో ఆసలు పెట్టుకుంది ప్రణిత. ఈ సినిమా షూటింగ్ లో ప్రణిత కొద్దిరోజులు నటించి ఆ తరువాత త్రివిక్రమ్ తో వచ్చిన మనస్పర్ధలతో ప్రణిత ఈ సినిమా నుండి తప్పుకుంది అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఆవార్తలను త్రివిక్రమ్ గతంలోనే ఖండించాడు.  ఈ నేపధ్యంలో ప్రణీతకు అనుకోకుండా ఒక బంపర్ ఆఫర్ తగిలింది. కోలీవుడ్ టాప్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ‘మాస్’ సినిమాలో ప్రణిత హీరోయిన్ గా అనుకోకుండా ఎంపికైంది అనే వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాకు హీరోయిన్స్ గా నయనతార ఎమీ జాక్సన్ లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాలో తనకు సెకండ్ హీరోయిన్ గా నటించడం తనకు ఇష్టం లేదంటూ ఈ ప్రాజెక్ట్ నుండి ఎమీ జాక్సన్ తప్పుకోవడంతో ఎప్పటి నుండో ప్రణితకు చాన్స్ ఇవ్వాలనుకుంటున్న సూర్య ప్రణికు సడన్ గా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడు అని టాక్. త్వరలో బల్గేరియాలో జరిగే షూటింగులో ప్రణీత జాయిన్ అవ్వనున్నట్లు సమాచారమ్.  ఈ చిత్రానికి దర్శకుడు వెంకట్ ప్రభు హారర్ ఫ్యాంటసీగా తెరకెక్కి స్తున్నాడని తెలుస్తోంది. అనుకోని అదృష్టాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రణిత మంచి జోష్ లో ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి: