నిన్న బయటకు వచ్చిన జూనియర్ ‘టెంపర్’ ఫస్ట్ లుక్ ఫోటోల పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు చేసాడు. “ఇప్పుడే ‘టెంపర్’ ఫోటోలను చూసాను తారక్ సింపుల్ గా అవుట్ స్టాండింగ్ ఇప్పటిదాగా జగన్ క్రియేట్ చేసిన బెస్ట్ హీరో క్యారెక్టర్ ఇదే అనుకుంటున్నాను ."అంటూ అందర్నీ తన నెగిటివ్ కామెంట్లతో హింసించే వర్మ జూనియర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.  ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లోకి తీసుకు వెళ్ళిపోయే సినిమాగా ‘టెంపర్’ మారబోతోంది అని అంటూ పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న బుల్లెట్ లా జూనియర్ ఈ సినిమాలో మారబోతున్నాడు అంటూ జోష్యం చెప్పాడు వర్మ. అంతేకాదు వర్మ మరో అడుగు ముందుకు వేసి యాంటి ఎయిర్ క్రాప్ట్ టాంక్ నుంచి విడిచిన మిస్సైల్ కన్నా పవర్ ఫుల్ గా తారక్ లుక్ ఉండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ.  అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో తారక్ లుక్ ను చూస్తూ ఉంటే మహేష్ నటించిన ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’ లు ఫ్లాఫ్ లు క్రిందే లెక్క అంటూ మరో వివాదానికి తెర తీసాడు వర్మ. అంతేకాదు ఇది అంతా తాను భవిష్యత్ లో జూనియర్ తో సినిమా చేసే ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేయడం లేదని చెపుతూ తారక్ ఫెరఫార్మన్స్ ను డైరెక్ట్ చేసే అంత అర్హత తనకు లేదు అని జూనియర్ పై కురిపిస్తున్న అతి పొగడ్తలు ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నా వర్మ లాంటి టాప్ డైరక్టర్ కు ఇదేమి పరిస్థితి అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: