రేపు విడుదల కాబోతున్న ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది అన్న ఆత్రుత పవన్ అభిమానులకే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులలో కూడా గంట గంటకు పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో రేపు విడుదల కాబోతున్న గోపాలుడి ఫస్ట్ లుక్ విషయంలో ఒక ఆ శక్తికర కధనం ఫిలింనగర్ లో వినపడుతోంది. ఈ ఫస్ట్ లుక్ విడుదలకు ముందే చూసిన కొందరు చెపుతున్న సమాచారం ప్రకారం రేపటి ఫస్ట్ లుక్ ఫోటోలో తెల్లటి డ్రస్ లో ఒక అందమైన ఊయలలో పవన్ కళ్ళు మూసుకుని పడుకుని ఉంటే ఆ ఊయల వెనుక వెంకటేష్, పవన్ కళ్యాన్ ను తదేకంగా చూస్తూ నిలబడి ఉంటాడట.  అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ కు ట్యాగ్ గా ‘భూమి పై ఉన్న దేవుడి ఒకేఒక్క స్నేహితుడిని కలవటానికి సిద్ధం కండి’ అనే మాటలు ఉంటాయని రూమర్. భగవంతుడు మెచ్చిన స్నేహితుడుగా వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి వీరిద్దరి పాత్రల స్వభావాలను పరిచయం చేస్తూ ఈ క్యాప్క్షన్ ఈ ఫస్ట్ లుక్ పై డిజైన్ చేసారు అనే వార్తలు వినపడుతున్నాయి.  ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా పవన్ గోపాలుడి ఫస్ట్ లుక్ రేపు మీడియాకు టాప్ న్యూస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: