జూనియర్ నటిస్తున్న ‘టెంపర్’ ఫస్ట్ లుక్ విడుదలైన కొన్ని గంటలకే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘పటాస్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తూ తమ్ముడితో అన్న పోటీ పడుతున్నాడా అనే వార్తలకు తెర తీసింది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తి అయిన ‘పటాస్’ లో కూడా కళ్యాణ్ రామ్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.  దీనికితోడు ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. జూనియర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమాకు కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘పటాస్’ సినిమాకు స్థూలంగా కథ విషయంలో కొన్ని పోలికలు ఉన్నాయి అనే వార్తలు చాలారోజుల నుంచి వినిపిస్తోంది. ఈ విషయాన్నీ తెలుసుకున్న జూనియర్ కూడా తన ‘టెంపర్’ కథ విషయంలో చాల మార్పులు చేసాడు అనే మార్పులు గతంలోనే వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ లు ఇంచుమించు కొద్ది గంటల తేడాతో విడుదల కావడం బట్టి చూస్తూ ఉంటే కళ్యాణ్ రామ్ తన ‘పటాస్’ ను జూనియర్ ‘టెంపర్’ కన్నా ముందుగా డిసెంబర్ లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడా అని అనిపిస్తోంది.  ఈ రెండు సినిమాలలోను పోలీస్ పాత్ర హీరో కావడంతో ముందుగా విడుదల అయ్యే ‘పటాస్’ సినిమా పోలికలు జూనియర్ ‘టెంపర్’ లో ఏమాత్రం కనిపించినా ఈ సినిమాకు తీవ్ర నష్టం జరుగుతుందని జూనియర్ అభిమానులు టెన్షన్ పడుతున్నారని టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: