నిన్న రాత్రి జరిగిన ‘చిన్నదానా నీకోసం’ ఆడియో ఫంక్షన్ లో ఎంతోమంది ప్రముఖుల సమక్షంలో నితిన్ పవన్ కళ్యాణ్ ఫోటోను బహిరంగంగా ముద్దు పెట్టుకున్న సంఘటన టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఈసినిమా ఆడియో విడుదల తరువాత వేదిక పైకి దండలతో వచ్చిన తన అభిమానులందారిని పలకరిస్తూ వారిచ్చే బొక్కెలు, దండలు తీసుకునే సందర్భంలో ఒక అభిమాని ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ లో పవన్, నితిన్ కలిసి ఉన్న ఒక లైన్ డ్రాయింగ్ ఫోటోను నితిన్ కు బహుమతిగా ఇచ్చాడు. అందరి సమక్షంలో ఆ గిఫ్ట్ ప్యాక్ ను విప్పిన నితిన్ పవన్ కళ్యాణ్ తో తాను ఉన్న ఫోటోను అందరికీ కనిపించేడట్లుగా చూపెడుతూ పవన్ ఫోటోకు ముద్దు పెట్టి తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు నితిన్. ఈ సందర్భంలో యాంకర్ భార్గవి నితిన్ ను ఈ బహుమతి పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని నితిన్ ని ప్రశ్నిస్తే తన గుండెల్లో ఉన్న దేవుడని మరోసారి చూస్తున్నాను అని ఉద్వేగ భరితంగా నితిన్ చాటుకోవడం నిన్నటి ఆడియో వేడుకకు హైలెట్ గా మారింది. ఏది ఎలా ఉన్నా ఈ ఆడియో వేడుక అంతా పవన్ నామస్మరణ మయంగా జరగండంతో అతిధిగా వచ్చిన నాగార్జున కొద్దిగా అసౌకర్యానికి గురైనట్లుగా వార్తలు కూడా ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: