సూపర్ స్టార్ రజినీకాంత్ నటించడానికి అంగీకరిస్తే చాలు దేశంలోని ప్రముఖ దర్శకులు అంతా సినిమాలు తీయడానికి ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. రజినీకాంత్ ని రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతమంది లక్షల సంఖ్యలో అభిమానులు రజినీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు.  అలాంటి రజినీకాంత్ పై ఒక కోలీవుడ్ దర్శకుడు రజినీకి రాజకీయాలలోకి వచ్చే అర్హత లేదు అంటూ సవాల్ విసరడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాలలోకి వెళితే తమిళ దర్శకుడు, నటుడు అయిన సీమాన్. ‘నాన్ తమిళర్ కట్చి' అనే పార్టీలో కొనసాగుతూ తమిళ జాతి మనుగడ, సంక్షేమం కోసమే తమ పార్టీ పుట్టింది అంటూ చాలా సంవత్సరాలుగా రాజకీయాలలో కొనసాగుతున్నాడు. ఈయన మాటలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయి. ఎల్టీటి అధినేత వేలుపిళ్లే ప్రభాకరన్ జయంతి సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ రజినీకాంత్ లాంటి వ్యక్తిని చాలామంది రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానించడం తనకు ఆశ్చర్యంగా ఉందని రజినీ తమిళ జాతికి ఏమి చేసాడు అని ప్రశ్నించడమే కాకుండా తమిళుడు కాని రజినీకాంత్ ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలను ఎలా పరిపాలిస్తాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అయితే ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపి రజినీకాంత్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ కామెంట్స్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: