నిన్న సాయంత్రం విడుదల అయిన పవన్ వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ అంతర్జాతీయ వెబ్ మీడియా ట్రెండ్స్ లో స్థానం సంపాదించి పవన్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతర్జాతీయంగా ఏ స్థాయికి వెళ్లిందో తెలిసేలా చేసింది. నిన్న వెబ్ మీడియాకు సంబంధించి అంతర్జాతీయంగా ఫేస్ బుక్, ట్విటర్ లలో జనo చూసిన ప్రముఖ విషయాలలో పవన్ ‘గోపాల గోపాల’ సినిమాకు సంబంధిచిన ఫస్ట్ లుక్ విడుదల న్యూస్ కూడా ప్రముఖ స్థానం సంపాదించింది. ఫస్ట్ లుక్ విడుదలైన కేవలం అర్ధ గంట సమయంలో దాదాపు ౩ లక్షల హిట్స్ గోపాలుడి ఫస్ట్ లుక్ కు యూట్యూబ్ లో వచ్చాయి అంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందోఅర్ధం అవుతుంది. నిన్న వెబ్ మీడియాలో నెటిజన్స్ అత్యంత ఆ శక్తిగా చూసిన అంశాలు 1. సోనమ్ కపూర్ నటిస్తున్న ‘డోలీ కి డోలీ’ సినిమాలోని పెళ్ళి కూతురు గెటప్ లుక్ 2. యమజాన్ డాట్ కామ్ శుక్రు వారం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ 3. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యుస్ మరణం.  ఈవార్తలతో సమానంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అతి కొద్ది సమయంలో పవన్ ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ ను చూసి ముచ్చట పడటమే కాకుండా ఆ ఫస్ట్ లుక్ ను తమ సన్నిహితులతో షేర్ చేసుకోవడంతో పవన్ గోపాలుడి ఫస్ట్ లుక్ న్యూస్ ఇప్పుడు ఏకంగా వెబ్ మీడియా అంతర్జాతీయ ట్రెండ్స్ లో స్థానం సంపాదించి తెలుగు వారి సత్తాను చాటేదట్లుగా చేసింది. ఈ క్రేజ్ తో పవన్ నిజంగానే టాలీవుడ్ ఎంపరర్ అని మరోసారి నిరూపించుకున్నాడు అని అనుకోవాలి..     

మరింత సమాచారం తెలుసుకోండి: