గత వారం విడుదలైన నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ కలెక్షన్స్ పరంగా ఎటువంటి రికార్డును రోహిత్ కు కలగ చేయలేక పోయినా రోహిత్ ను మంచి నటుడిగా మరోసారి ప్రూవ్ చేసింది ‘రౌడీ ఫెలో’. అయితే ఈ సినిమాలో నారా రోహిత్ లుక్ విపరీతమైన విమర్శలకు తావు ఇచ్చింది. రోహిత్ ఈ సినిమాలో విపరీతమైన లావుగా కనిపించడంతో ఎవర్నీ ఆకర్షించలేకపోయాడు. ఈ కామెంట్స్ రోహిత్ దృష్టి వరకు వచ్చాయి కాబోలు ప్రస్తుతం రోహిత్ నటిస్తున్న ‘పండుగ లా వచ్చాడు’ సినిమాలో తన లుక్ కోసం చాల జాగ్రత్తలు తీసుకుంటునట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రభాస్, రానా లు ఇలా విపరీతంగా బరువు పెరిగి పోయినప్పుడు వారి బరువు తగ్గించు కోవడానికి సలహాలు ఇవ్వడమే కాకుండా దగ్గర ఉండి ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించిన ఒక ప్రముఖ ముంబాయి ఫిట్ నెస్ ట్రైనర్ వద్ద రోహిత్ రోజు క్లాసులు తీసుకుంటు చాల ఖచ్చితమైన డైట్ ను పాటిస్తూ యంగ్ హీరోలతో సమానంగా అందమైన లుక్ లో కనిపించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తన లుక్ పూర్తిగా మారే దాకా మరి ఏ కొత్త సినిమాలను ఒప్పుకోకుండా తన దృష్టి అంత తన బాడీ ఫిట్ నెస్ పైనే పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తన లుక్ వీలైనంత త్వరగా మార్చుకుని ‘పండుగ లా వచ్చాడు’ షూటింగ్ ను వేగవంతం చేయాలని ఆలోచనట..

మరింత సమాచారం తెలుసుకోండి: