వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దేముళ్ళనే కాదు మృత్యువుతో తో పోరాటం చేస్తున్న వారిని కుడా వదలడు అనే ఆశక్తికర విషయం జరిగింది. దర్శకుడ కే బాలచందర్ మరణించినట్లు, దానికి తన సంతాపాన్ని తెలియ చేస్తున్నట్లు ట్వీట్ చేసి రామ్ గోపాల్ వర్మ మరోసారి తానూ ఏవిషయాన్ని అయినా ఎటువంటి ఆలోచనా లేకుండా ఆ విషయం పై ప్రవర్తిస్థాడో ఈ ట్విట్ ని బట్టి మరోసారి రుజువు చేసుకున్నాడు.  అయితే వర్మ ట్విట్ పై విపరీతమైన అలజడి రావడంతో పొరపాటు గ్రహించిన వర్మ కొంత సమయం తరువాత ట్విట్ ను తొలగించాడు. అయితే చాలామంది బాలచందర్ అభిమానులు మాత్రం వర్మ చేసిన ట్విట్ వల్ల కీడు తొలిగిపోయి బాలచందర్ తన అనారోగ్యం నుండి పూర్తిగా బయట పడతాడు అని ఆనంద పడుతున్నారు.  ఈ వార్తలు ఇలా ఉండగా చెన్నైలోని కావేరి హాస్పటల్ లో వైద్యం పొందుతున్న బాలచందర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా అలాగే నిలకడగా ఉన్నా పూర్తిగా ప్రమాద పరిస్థితి నుండి బయటకు రాలేదని నిన్న సాయంత్రం డాక్టర్స్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. బాలచందర్ త్వరగా కోలుకుని తన శిష్యుడు కమల్ తో నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమాను కమల్ కోరుకున్నట్లుగా చూసి ఆనందిస్తారని కోరుకుందాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: