క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తీసినవి చాల కొద్ది సినిమాలు మాత్రమే అయినా తాను తీసిన ప్రతి సినిమాకు ఒక సామాజిక కోణం ఉండేదట్లుగా జాగ్రత్తలు తీసుకుంటాడు. ‘గమ్యం’ సినిమా నుండి కొంతకాలం క్రితం వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్’ వరకు ఆ సినిమాల విజయంతో సంబంధం లేకుండా నేటి టాలీవుడ్ దర్శకులలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగాడు క్రిష్. అటువంటి క్రిష్ రానా వెనుక ఉన్నాడు అనే విశ్లేషణలు వినపడుతున్నాయి.  ఇప్పటి వరకు సాదాసీదా పాత్రలను చేసిన రానాకు టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలలో ముఖ్య పాత్రలకు రానా సరిపోతాడు అని ఆ సినిమా దర్శకులకు అభిప్రాయం కలిగించడానికి క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లోని రానా నటించిన ఒక పౌరాణిక డ్రామాకు సంబంధించిన డైలాగ్స్ అనే ప్రచారం ఉంది.  ఈ సినిమాలో రానా చెప్పిన పౌరాణిక డైలాగ్స్ మాడ్యులేషన్ చూసిన తరువాత దర్శకుడు గుణశేఖర్, రాజమౌళీలకు రానాలో ఒక మంచి నటుడు ఉన్నాడు అన్న అభిప్రాయం కలిగిందట. ఈ విషయాన్ని గుణశేఖర్ ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాడు.  ఏది ఇలా ఉన్నా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సక్సస్ కాకపోయినా రానాకు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి భారీ సినిమాలను ఇచ్చి టర్నింగ్ పాయింట్ గా మారింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: