నిన్న అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అఖిల్, వినాయక్, నితిన్ లు కలిసి అఖిల్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన సినిమా స్క్రిప్ట్ కు పూజ చేయించడంతో అఖిల్ సినిమా ప్రారం భానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అదేవిధంగా నితిన్ నిన్న తన ట్విటర్ లో అఖిల్ నటించబోయే తొలి సినిమాను తన తండ్రి సుధాకర రెడ్డి వినాయక దర్శకత్వంలో నిర్మిస్తున్నాడని అధికారికంగా తన ట్విటర్ ద్వారా తెలియచేయడంతో ఈ సినిమా ప్రారంభానికి ఇక అన్ని విషయాలు లైన్ క్లియర్ అయినట్లుగా అర్ధం అవుతోంది. అదేవిధంగా ఈ సినిమా తొలి క్లాప్ ముహూర్తాన్ని కూడా ఈరోజు చేసారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈరోజు తోలి షాట్ తీసారని తెలుస్తోంది. ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ఈ సినిమా కధను వెలుగొండ శ్రీనివాస్ నాగార్జున సలహాల మేరకు చాల విభిన్నంగా తయారు చేసాడని వార్తలు వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఎంపిక విషయంలో అటు నాగార్జున కాని ఇటు వినాయక్ కాని ఇంతవరకు ఒక నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ను దర్శకుడు వినాయక స్వయంగా సంప్రదించినా అలియా దగ్గర నుండి సరైన స్పందన ఇప్పటి వరకు రాకపోవడంతో ఇంకా ఈ సినిమా హీరోయిన్ హంట్ కొమసాగుతునే ఉండి అనే వార్తలు వినపడుతున్నాయి. ఏమైనా ఈ సంవత్సరం చివరిలో అఖిల్ సినిమా గురించి క్లారిటీ వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: