ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీ భార్య శ్రావణి హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చక్రీ చనిపోయిన తర్వాత తన అత్తింటివారు ఆస్తి కోసం తనని వేధిస్తున్నారని ఆమె హెచ్చార్సీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది.  చక్రి చనిపోయిన తరువాత కనీసం తనకి బట్టలు కూడా అందుబాటులో లేకుండా బీరువాలకు లాక్ చేశారని, తన బంగారు ఆభరణాలు సైతం లాగేసుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన అత్త, చక్రీ అక్కాచెల్లెళ్లే తనని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. భర్త చనిపోయిన ఆవేదనలో వున్న తనని ఆదరించాల్సిన అత్తింటివారే యిలా వేధింపులకు గురిచేయడం తనను మానసికంగా క్షోభకు గురిచేస్తోందని ఆమె వాదన. చక్రీ చనిపోయి వారం కూడా కాకుండానే, దిన కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఇలా చక్రి భార్య మీడియా ముందు తన భాదను వ్యక్త పరచడం అటు మీడియాకు ఇటు టాలీవుడ్ పరిశ్రమకు హాట్ టాపిక్ గా మారింది.  ఈమె ఫిర్యాదుతో చక్రి కుటుంబంలో నెలకొన్న ఆస్థి తగాదాలు ఓపెన్ సీక్రెట్ గా బయట పడ్డాయి. మరి రానున్న రోజులలో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని రకాల మలుపులు తీసుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: