నందమూరి సింహం బాలకృష్ణ కృష్ణ గుంటూరు జిల్లాల మధ్య నిర్మాణం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి నందమూరి తారకరామారావు పేరు పెట్టాలనే ప్రస్తావన మళ్ళీ తీసుకు రావడంతో కొత్తగా ఏర్పడ బోతున్న రాజధాని పేరుకు సంబంధించిన వ్యవహారం మరో కొత్త టర్న్ తీసుకుంది.  ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రాంతాన్ని వేరే జిల్లాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి తన తండ్రి నందమూరి తారక రామారావు పేరు పెట్టాలి అని గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చాడు బాలయ్య. అయితే కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ నూతన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండటంతో ఆ ప్రాంతానికే చెందిన తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పేరు కలిసే విధంగా నూతన రాజధాని పేరు ఉంటే బాగుంటుంది అని రోజురోజుకు తెలుగుదేశ వర్గాల ఆలోచానల్లో వస్తున్న మార్పులను పసిగట్టిన బాలకృష్ణ ఇప్పుడు బహిరంగంగా తన తండ్రి పేరు కొత్తరాజధాని పేరులో ఉండాలి అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి బాలకృష్ణ వచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.   అయితే ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూముల విషయంలో కొందరు రైతుల నుండి వ్యతిరేకత వచ్చిన విధంగానే ఇప్పుడు కట్టబోతున్న రాజధాని పేరుకు సంబంధించిన విషయం కూడా హాట్ టాపిక్ కాబోతోంది.  ఎప్పటి నుంచో నందమూరి తారకరామారావుకు భారత రత్న వస్తే బాగుండును అని ఆశ పడుతున్న నందమూరి అభిమానుల కోరిక తీరని నేపధ్యంలో బాలకృష్ణ చివరి వరకు పోరాడి కట్టబోయే రాజధాని పేరులో నందమూరి పేరును చేర్చ గలిగితే అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నందమూరి వంశానికి ఒక సువర్ణాధ్యాయంగా మిగిలి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: