టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం సుకుమార్ సంబంధించిన ప్రాజెక్ట్ లో పని చేయబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ పూజా కార్యక్రమాలు జరిపోయాయి. దీంతో సుకుమార్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా, జూనియర్ కెరీర్ లోనే హైలెట్ గా ఉంటుందని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న సుకుమార్, జూనియర్ ల చిత్రం, 2015 జనవరి 7 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందంటూ నిర్మాత వివరించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన తుది మెరుగులని సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ ను ఇప్పటివరకూ చూడని కొత్త అవతారంలో చూపించడానికి సుకుమార్ కృషి చేస్తున్నారు. హీరో క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేస్తున్నారు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ మూవీ హీరోయిన్ గా కొత్త హీరోయిన్ ని తీసుకునేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు హీరోయిన్ రెజీనా కూడ జూనియర్ సరసన నటించే ఛాన్స్ ఉందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సుకుమార్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఆసక్తికరమైన మాటలకు తెరలేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: