సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న హీరోయిన్ కాజల్. అంతే కాకుండా కాజల్ గత కొంత కాలంగా నెంబర్ వన్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ లో తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూజ్ అయిన తరువాత ఏ విధంగా ఉందో, ఇప్పుడు కూడ అలాగే ఉందా? అంటే కొద్దిగా అనుమానంగానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా తను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చినప్పుడు ఏ విధంగా స్లిమ్ గా ఉందో, ఆ తరువాత ఏ విధమైన ఫిజిక్ ని మెయింటెన్ చేసిందో, ఇప్పుడు అటువంటి డైట్ ని కాజల్ ఏ మాత్రం పాటించడం లేదంట. దీంతో కాజల్ చబ్బీ చబ్బీగా ఉంది. తాజాగా కాజల్ తన శరీరంలోని ఫాట్ పర్సంటేజ్ ని తగ్గించుకునే ప్రతయ్నాలు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్యలను చేపట్టింది. అయితే తను చాలా సహజంగా స్లిమ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. కాని గత ఆరు నెలల నుండి తను చేస్తుంది ఏ ప్రతయ్నాలు, సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో కాజల్ చేయించుకోవటానికి సిద్ధపడుతుంది. గతంలో కాజల్ సర్జరీ చేయించుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడేది కాదు. అందంగా కనిపించడానికి చాలా మంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని న్యాచురల్ బ్యూటీని కోల్పోతారు. అలాంటి వ్యవహారాలకు విరుద్ధం అంటూ తెగ మాటలు చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు మాత్రం తనే స్వయంగా సర్జరీని చేయించుకోవటానికి ఇష్టపడటంతో, తను ఏ భాగాన్ని తగ్గించుకుంటుదో అనేది సౌత్ లో న్యూస్ గా మారుతుంది. కాజల్ స్నేహితుల వద్ద నుండి అందుతున్న సమాచారం మేరకు, కాజల్ తన శరీరంలోని నడుము భాగాన్ని సరైన ఆకృతిలో మార్చుకునేందకు ఆసక్తి చూపుతుందట. అలాగే ఫేస్ లోనూ కొద్దిపాటి మార్పులకి కాజల్ ఇష్టపడుతుందని సౌత్ మీడియా టాక్. ప్రస్తుతం తనకు కమిట్ అయిన మూవీల షెడ్యూల్స్ పూర్తైన వెంటనే, తన సర్జరీ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటుందనే న్యూస్ సౌత్ మీడియాలో బాహాటంగానే వినిపిస్తుంది. ప్రస్తుతం కాజల్ ఎన్.టి.ఆర్ సరసన ‘టెంపర్’లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: