సినిమా హీరోలను ఆరాధిస్తూ ఆ హీరోల సినిమాలను మొదటిరోజు మొదటి షో నుండి హడావిడి చేసే యువతరానికి భవిష్యత్ ఉండదు అని అంటూ ఉంటారు. కానీ ఆ మాటలను అబద్ధం అంటూ పవన్ వీరాభిమాని అయిన ఒక యువకుడు ఆ మాటలను తారుమారు చేసాడు.  ఆ యువకుడు ఐఐటీ లో ఇంజనీరింగ్ చదువుతున్న పృద్వీరాజ్. పవర్ స్టార్ సినిమా విడుదల అయిందంటే ఎన్నిపనులున్నా ఆఖరుకు పరీక్షలు మరుసటి రోజే ఉన్నా అవేవీ పట్టించుకోకుండా పవన్ సినిమాను మొదటిరోజు మొదటి ఆట చూడటమే కాకుండా పవన్ అభిమానులతో కలిసి ధియేటర్లలో సందడి చేయడం ఇతడికి ఎంతో ఇష్టమైన పని.  పవన్ పట్ల ఇంత పిచ్చి వీరాభినం ఉన్నా పృద్వీరాజ్ తన చదువు పట్ల ఎప్పుడూ ఏ మాత్రం అశ్రద్ధ చేయలేదు. చాల కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. ఆ ఉన్నత విద్యలో కొత్త మెలకువలు నేర్చుకుని చాకులా మారాడు. ఈమధ్యనే పృద్వీరాజ్ చదువుతున్న కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ‘శామ్ సంగ్’ పృద్వీకి ఏడాదికి రూ.1కోటి జీతం ఆఫర్ చేస్తూ ఉద్యోగం ఇచ్చింది.  దీనితో పృద్వీ విజయ వార్తను తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులే కాకుండా పవన్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. తన వినూత్నమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు పవన్ అభిమానులు కూడా తలుచు కుంటే ఏదైనా సాధించగలరు. అని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: