మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న ‘ముకుంద’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇక సెన్సార్ కూడా పూర్తి కావడంతో ఈ సినిమాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక ఈసినిమాకు సంబంధించి వినిపిస్తున్న సెన్సార్ టాక్ ప్రకారం గోదావరి తీరంలోని ఒక పల్లెటూరు నేపధ్యంలో జరిగే ఈ సినిమా కథలో ఒక మనిషి ఎదగాలి అంటే నిజాయితీ ఎంత ముఖ్యమో తెలియచేసే అంతర్లీన సందేశం ఈ సినిమా కధలో ఉంది అని టాక్.  ఈ సినిమాకు మణికందన్ అందించిన ఫోటోగ్రఫీ గుండెకాయలా మారిందని తన విజువల్స్ ద్వారా వరుణ్ తేజ్, పూజా హెడ్గే లను అందంగా చూపించడమే కాకుండా గోదావరి అందాలను చాల కన్నుల విందుగా చూపెట్టాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను చూసిన సెన్సార్ వారు ఈసినిమా చాల బాగా వచ్చిందని, వరుణ్ తేజ్ కి మొదటి చిత్రమయిన కానీ చాల బాగా నటించాడని ప్రశంసలు కురిపించడమే కాకుండా శ్రీకాంత్ అడ్డాలను మరో ఆణిముత్యం లాంటి అచ్చ తెలుగు సినిమా అందించినందుకు పదేపదే అభినందించారని టాక్.  దీనితో పాటుగా పూజా హెడ్గే ‘గోపికమ్మ’ సాంగ్ లో అచ్చం తెలుగుమ్మాయి లా ఉందని సెన్సార్ సభ్యులు ఆనంద పడ్డారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన రావ్ రమేశ్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపించబోతోందని అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.  ఇప్పటికే పాటలు బాగా హిట్ అయిన ఈ సినిమా క్రిస్మస్ సెలవలను టార్గెట్ చేసుకుంటూ వచ్చే వారం విడుదల అవుతున్న నేపధ్యంలో మెగా అభిమానులకు పండుగగా ఉన్నా నితిన్ సినిమా ‘చిన్న దాన నీకోసం’ తో పోటీగా వస్తూ ఉండటంతో క్రేజీ హీరో మెగా హీరోల మధ్య పోటీగా వచ్చే వారం క్రిస్మస్ సెలవలు మారనున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: