క్యూట్ హీరోయిన్ సమంత తాను కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నాను అంటూ నిన్న సమంత తన ట్విటర్ లో ట్విట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈమధ్య వరసపెట్టి షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత కాస్త తీరిక దొరకడంతో చెన్నైలోని తన ఇంటికి వెళ్ళి తాను కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందట.  అంతేకాదు తనకిష్టమైన దోస, ఇడ్లీ, వడ, పొంగల్ టిఫిన్స్ ను ఎటువంటి లిమిట్స్ లేకుండా తనకు తినాలి అనిపించినంతగా తెగ తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నానని ట్విట్ చేసింది సమంత. అంతేకాదు తనకు చెన్నైలో ఇష్టమైన ‘గ్రాండ్ చోళ’ రెస్టారెంట్ లో ఈ హంగామా అంతా చేస్తున్నానని ట్విట్ చేసింది సమంత. ఈ హడవిడిని మరి కొద్దిరోజులు ఇలాగే కొనసాగిస్తానని ఇలా తినడం వల్ల తనకు అనారోగ్యం వచ్చినా పట్టించుకొననీ తన పై తానే సెటైర్లు వేసుకుంటోంది సమంత. ఆమధ్య సమంతకు స్కిన్ సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్స్ సలహా పై చాల స్ట్రిక్ట్ డైట్ తీసుకుని ఆ సమస్యలనుండి బయట పడ్డ సమంత తిరిగి ఇలా తిండి విషయంలో రెచ్చి పోవడం చూస్తూ ఉంటే మళ్ళీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆమెకు కోట్లు ఇచ్చిన నిర్మాతల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి.  రాబోతున్న క్రిస్మస్ ను సెలిబ్రేట్ చేసుకుని తనకిష్టమైనవి తింటూ సమంత ఇలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: