ఇంత వరకు ప్రభాస్, రానా, అనుష్క పుట్టినరోజులను తన ‘బాహుబలి’ మేకింగ్ వీడియోలతో, స్టిల్స్ తో సెలెబ్రేట్ చేసిన రాజమౌళి రేపటి నుంచి ముంబాయిలో ప్రారంభం కాబోతున్న ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ‘బాహుబలి’ స్పెషల్ ప్రీవ్యూ వీడియో గురించి ఇప్పుడు టాలీవుడ్ చాల ఆ శక్తికరంగా ఎదురు చూస్తోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ స్పెషల్ వీడియోలో ‘బాహుబలి’ గురించి పెద్ద మ్యాజిక్ రాజమౌళి ఈ ఫిలిం ఫెస్టివల్ లో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుండి సినిమా రంగానికి చెందిన ప్రముఖులు వస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్ ను రాజమౌళి తన ‘బాహుబలి’ మార్కెట్ పెంచుకోవడం కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకొబోతున్నాడని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ప్రభాస్ రానాలను పెట్టి 1000 ఏనుగులతో రాజస్థాన్ ప్రాంతంలో మరో భారీ యుద్ధ సన్నివేశం తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏనుగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రాజమౌళి తన సహాయకుల ద్వార ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి ప్రతిరోజు వస్తున్న వార్తలు ఈ సినిమా క్రేజ్ ను ఆకాశం పై కూర్చో పెడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: