క్రిస్మస్ కు ముకుందుడుగా సందడి చేయబోతున్న వరుణ్ తేజ్ తన సినిమా ప్రమోషన్ గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ తన పెద్దనాన్న చిరంజీవి చిన్ననాన్న పవన్ కళ్యాణ్ ల గురించి కొన్ని ఆ శక్తికరమైన విషయాలు ఈమధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసాడు. తన చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్లమని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ రామ్ చరణ్ తన చిన్నప్పుడు ఎప్పుడూ కళ్యాణ్ బాబాయ్ కే సపోర్ట్ ఇచ్చే వాడని అయితే తను మాత్రం ఎప్పూడూ తన పెద్దనాన్న చిరంజీవి మాటలను అనుసరిస్తూ ఉండేవాడిననీ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు ప్రతి శనివారం తాను పెద్దనాన్న దగ్గరే పడుకునే వాడిననీ అంటూ తనకు ఇప్పటికీ చిరంజీవి అంటే ఎంత గౌరవమో అంత ప్రేమ అంటూ తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు ఈ ముకుందుడు. తనకు వ్యక్తిగతంగా తన పెద్దనాన్న చిరంజీవి చిన్ననాన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు సమానమే అయినా ఈ ఇద్దరిలో మొదట నీ ఓటు ఎవరికీ అంటే తన సపోర్ట్ మటుకు మొదటిగా చిరంజీవి వైపే చూపుతాననీ తన పెద్దనాన్న పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.  అటు పెద్దనాన్న ఇటు చిన్ననాన్నల ప్రేమతో పాటు వారి వారసత్వాన్ని కూడా వరుణ్ తేజ్ కొనసాగిస్తూ ఉండటంతో పవన్ చిరంజీవుల పై తనకున్న ప్రేమను చాల తెలివిగా ప్రదర్శిస్తూ వరుణ్ తేజ్ తన కెరియర్ కు సోపానాలు నిర్మించుకుంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: