నిన్న ఉదయం తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు పొందిన నితిన్ నిన్న సాయంత్రం తిరుపతిలో ఎస్ వి యూ ఆడిటోరియంలో తాను క్రిస్మస్ కు విడుదల చేయబోతున్న ‘చిన్న దాన నీకోసం’ ఆడియో సక్సస్ మీట్ ను అతి ఘనంగా నితిన్ నిర్వహించాడు. హీరోయిన్ మిస్త్రీ, డెరైక్టర్ కరుణాకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్‌‌స డ్రమ్ముతో, నటుడు ఆలీ డ్యాన్‌‌సతో యూత్‌కు కిక్ ఎక్కించారు.  ఈ సందర్భంలో నితిన్ మాట్లాడుతూ తనకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి అని, అందుకే తన ప్రతి సినిమాలో పవన్‌కల్యాణ్ పేరు వచ్చేట్టు చూసుకుంటానని చెపుతూ గతంలో వరసగా 12 ఫ్లాపులు తన సినిమాలకు వచ్చినప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులను తాను గడిపానని అంటూ ‘ఇష్క్’ సినిమా ఆడియో వేడుకకు పవన్ వ్యక్తిగతంగా వచ్చి తనను ఆశీర్వదించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయి తిరిగి తన కెరియర్ ఒక అనుకోని మలుపు తిరిగిందని పవన్ ను పొగడ్తలతో ముంచెత్తి వేసాడు నితిన్. అంతేకాదు తన దృష్టిలో ఆరోజు దేముడు పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చి తనకు మరో జీవితాన్ని ప్రసాదించాడని ఉద్వేగభరితంగా పవన్ ను ఆకాశానికి ఎత్తేశాడు నితిన్. పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ తీసిన కరుణాకరణ్ అదే హిట్ ను తనకు అందించబోతున్నాడు అని జోస్యం చెప్పాడు నితిన్. అయితే పవన్ ను ఇన్ని పొగడ్తలు పొగుడుతున్న నితిన్ పవన్ కొడుకు వరుణ్ తేజ్ సినిమాతో పోటీగా రావడం మాత్రం మానటం లేదు. దీనిని బట్టి చూస్తూ ఉంటే నితిన్ వ్యూహాత్మక ఎత్తుగడలు అర్ధం కానివిగా మారుతున్నాయి అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: