గత కొంత కాలంగా దిల్ రాజ్ నిర్మాతగా ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ గా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో దిల్ రాజ్ పై రకరకాల గాసిప్ లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇన్ని సమస్యల మధ్య ఉన్న దిల్ రాజ్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన ‘పటాస్’ సినిమాను నైజాం, వైజాగ్, కృష్ణ ఏరియాలకు కలిపి భారీగా కొనడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఈ నెలలో విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ సోదరుడు జానకి రామ్ మరణంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. తన సినిమాలకు హిట్ టాక్ తెచ్చుకుని కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ఎంతో సాహసం చేసి నిర్మించిన ఈ పటాస్ ను దిల్ రాజ్ కొనడం వెనక ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అనే ప్రచారం జరుగుతోంది. సినిమాల పట్ల మంచి అంచనాలు ఉన్న దిల్ రాజ్ ‘పటాస్’ ను కొనడంతో ప్రస్తుతం బయ్యర్లలో ఈ సినిమా పట్ల క్రేజ్ అనుకోని విధంగా ఏర్పడింది అనే వార్తలు ఉన్నాయి. ఏమైనా దిల్ రాజ్ ఆశ్చర్యకర నిర్ణయం కళ్యాణ్ రామ్ పటాస్ కు కలిసి వచ్చింది అనుకోవాలి. అయితే ఈ ఎత్తుగడలు ఎంత వరకు లాభిస్తాయి అన్న విషయం జనవరిలో తేలిపోతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: