ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మెచ్చుకోదగ్గ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ సాధించిన సక్సెస్ లు ఎన్ని ఉన్నాయో, అదే విధంగా తను సంపాదించుకున్న డిజాస్టర్స్ కూడ అంత కంటే ఎక్కువే ఉన్నాయి. సంపాదించుకున్న డిజాస్టర్స్ అని ఎందుకు అన్నామంటే, వర్మ రెగ్యులర్ ఫార్మెట్ లో మూవీలని తీసి ఉంటే, ఇప్పటికి ఎన్నో మంచి ఫిల్మ్స్ ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించి ఉండేవాడు. అనవసరపు సరికొత్త ప్రయోగాలను క్రియేట్ చేసి, జనాలకు లేని ఆసక్తిని అనవసరంగా రుద్ది, బాక్సాపీస్ వద్ద వరుస ప్లాపులని చవిచూస్తున్నాడు. ఇదిలా ఉంటే వర్మకి బిటౌన్ లో దాదాపు పెద్ద సంఖ్యలో అప్పులు ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ఇంత కాలం కేవలం తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్న వర్మ, ఇప్పుడు తనకే తెలియకుండా జరిగిన తనకి సంబంధించిన అప్పులను తీర్చే పనిలో పడ్డాడంట. అందుకు ఇక నుండి తను ఎటువంటి ప్రత్యేక మూవీలను రూపొందించకుండా, రెగ్యులర్ ఫార్మెట్ లో ఓ మూవీని తీయాలని నిర్ఛయించుకున్నాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు అభిమానులు హర్షిస్తున్నారు. తను రెగ్యులర్ ఫార్మెట్ లో తెరకెక్కిస్తున్న మూవీలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఓ భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేయనున్నాడు. ఈ సినిమా తన గత చిత్రాల మాదిరి ప్రయోగాత్మకంగా వుండదు కాబట్టి, కచ్ఛితంగా బాక్సాపీస్ ను షేక్ చేయగల సత్తా ఉంటుందనేది అందరి ఫీలింగ్. ఇంకా ఈ రెగ్యులర్ ఫార్మాట్ లో వస్తున్న వర్మ మూవీలో జగపతిబాబు, మంచు విష్ణు లు కూడా ప్రధాన పాత్రలులు పోషించనున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల వర్మ తెరకెక్కిస్తున్న ‘స్పాట్’ షూటింగ్ అనంతరం ఈ సినిమాను తెరకెక్కించే సూచనలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: