ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు ఏదో ఒకవిధంగా ఆ సినిమాల దర్శక నిర్మాతలు కథరీత్యా కోరుకున్న టైటిల్ పెట్టుకోవడం ఒక భారీ సమస్యగా మారిపోతోంది. ఒకవైపు తాము తీస్తున్న సినిమాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో అన్న టెన్షన్ తో పాటు ఈ టైటిల్ వివాదాలు నిర్మాతలకు తీవ్ర తలనొప్పిగా మారుతోంది.  ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు సత్యదేవా కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘లయన్’ అనే టైటిల్ ను అనుకుంటే ఆ టైటిల్ ను తెలంగాణా ఫిలించాంబర్ లో రిజిస్టర్ అయింది అన్న నెపంతో ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న నిర్మాత బాలకృష్ణకు చుక్కలు చూపెడుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ వ్యవహారంలో ఒక రాజీకి వచ్చి బాలయ్య కోరుకున్న ‘లయన్’ టైటిల్ నందమూరి సింహం సొంతం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఇంకా అధికారిక సమాచారం లేదు. ఇప్పుడు ఇదే రకంగా విజయ్ హీరోగా శింబు దేవన్ దర్శకత్వంలో కోలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో శ్రీదేవి, హన్సిక, శ్రుతిహాసన్ లతో సినిమాను తీస్తున్న నిర్మాతలకు ఈ టైటిల్ వివాదం తలకు చుట్టుకుంది అని టాక్.  మొదట్లో ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ ను పెట్టినట్లుగా ప్రచారం జరగడంతో ఈ ‘గరుడ’ అనే పదం పురాణాలలోని దేముడికి సంబంధించిన వాహనం కాబట్టి ఆ టైటిల్ ను విజయ్ సినిమాకు టైటిల్ గా పెట్టకూడదు అని ఒక లాయర్ ఈ సినిమా నిర్మాతలకు నోటీసులు ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనితో టాప్ హీరో విజయ్ కూడా తన సినిమాల టైటిల్ కు సంభంధించి బాలకృష్ణ లాగే తన సినిమాకు తాను కోరుకున్న టైటిల్ పెట్టుకోలేక అటు బాలయ్య ఇటు విజయ్ ఒకే రకమైన సమస్యల మధ్య తమ సినిమాలను పూర్తి చేస్తున్నారు అంటూ సెటైర్లు పడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: