రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాలోని తమన్నా ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది గంటలకే విమర్శలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈసినిమాలోని తమన్నా లుక్ గతంలో శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లుక్ ను పోలి ఉంది అనే కామెంట్లు మొదలైపోయాయి. రాజమౌళికి ఇచ్చిన మాట ప్రకారం తాను 6 కిలోల బరువు తగ్గి ఎంతో కష్టపడి గుర్రపుస్వారీ తో పాటు కత్తి సాములు, విలువిధ్యలు నేర్చుకుని ప్రస్తుతం బల్గేరియాలో మైనస్ టెంపరేచర్ ను కూడా లెక్క చేయకుండా రాజమౌళిని మెప్పిస్తూ కష్టపడి నటిస్తున్న తన ఫస్ట్ లుక్ కు ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ రావడం ఏమిటి అని తమన్నా బాధ పడుతున్నట్లు టాక్.  ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించబోతున్న తమన్నా నటన పరంగా తన టాలెంట్ ను చూపెట్టుకోవడానికి ఎంతో కష్ట పడుతోంది. అయినా తమన్నా కష్టాన్ని పట్టించు కోకుండా ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడం తమన్నాకు షాకింగ్ న్యూస్ అనుకోవాలి.  ఒకనాటి శ్రీదేవి ఇంద్రజ పాత్ర తమన్నా అవంతికను వెంటాడటం తమన్నాకే కాదు రాజమౌళికి కూడా తలనొప్పి వ్యవహారమే..

మరింత సమాచారం తెలుసుకోండి: