టాప్ హీరోల భారీ సినిమాలు కూడా రెండవ వారం వచ్చే సరికి ధియేటర్లలో సగం పైగా ఖాళీలు ఏర్పడుతున్న నేటి రోజులలో కోటి రూపాయలతో తీసిన ఒక చిన్న సినిమా ఇప్పటి వరకు 7 కోట్లు వసూలు చేసింది అనే వార్తలు టాలీవుడ్ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.  మాటివి షార్ట్ ఫిలిం పోటీలలో విజేతగా వచ్చిన రాహుల్ సంకృత్యన్ నూతన నటీనటులతో తీసిన ఈ సినిమా ఒక హర్రర్ కాన్సెప్ట్ మూవి. అయితే ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే విధంగా ఈ సినిమాను ఈ దర్శకుడు తీయడంతో ఈ సినిమా విడుదలై మూడవ వారంలోకి వచ్చినా కలెక్షన్స్ పడిపోకుండా మన ఇరు రాష్ట్రాలలోను కొనసాగుతూ ఉండటంతో ఈ సినిమా ఈమధ్య కాలంలో వచ్చిన సైలెంట్ హిట్ అని అంటున్నారు.  ఈ సినిమాకు ఏ విధమైన భారీ పబ్లిసిటీ చేయకపోయినా ప్రేక్షకులు బయట వినపడుతున్న మౌత్ పబ్లిసిటీని ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్దకు రావడం ప్రేక్షకులు సినిమా బాగుంటే ఎలా ఆదరిస్తారో మరోసారి రుజువు చేసింది.  మొదట్లో ఇరు రాష్ట్రాలలోను అతి తక్కువ ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా తన ధియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుని టాప్ నిర్మాతల దృష్టిని ఆకర్షించడంతో ఈ సినిమాను కన్నడ, తమిళ భాషలలో రీమేక్ చేయడానికి చాలామంది అప్పుడే ఈ దర్శక నిర్మాతల ముందు క్యూ కడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: