డేషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మల మధ్య ప్రేమ వ్యవహారం తెలిసిన విషయమే. ప్రస్తుతం వారు కలిసి సహజీవనం చేస్తున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ వ్యవహారశైలిపై విరాట్ కోహ్లీ తీవ్ర కోపానికి గురియ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈమధ్య లేటెస్ట్ గా అనుష్క శర్మ ఒక మేగ్ జైన్ కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ కారణం అని టాక్. ఈఫోటో షూట్ లో రెచ్చిపోయి స్కిన్ షో ను ప్రదర్సించడమే కాకుండా కొద్దిగా ఎక్కువ మోతాదులో హాట్ లుక్స్ తో కెమేరాకు ఫోజులిచ్చినందుకు విరాట్ కోహ్లీ అనుష్కను ఈ విషయమై ప్రస్తుతం తాను ఉన్న ఆస్ట్రేలియా నుండి గట్టిగా మందలించాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే అనుష్క అదే స్పీడ్ తో ఇది నా వృత్తికి సంబంధించిన విషయం అంటూ ఘాటుగా విరాట్ కోహ్లీకి సమాదానం ఇచ్చిందని బాలీవుడ్ మీడియాలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ జంట పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఈ హాట్ ఫోటో షూట్ అంశం వారి మధ్య చిన్నపాటి చిచ్చు రేపినట్లు బాలీవుడ్ వార్తలను బట్టి అర్ధం అవుతోంది. మరి రానున్న రోజులలో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: