టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు. వారందరిలో బాగా తెలివైన వాడు ఎవరంటే కచ్ఛితంగా రాజమౌళి అనే చెప్పాలి. ఎందుకంటే తను ఏదైతే మూవీని ఆలోచిస్తాడో, దానిని తెరకెక్కించడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తుంటాడు. కథకి ఎటువంటి జిమ్మిక్కులు కావాలో, అలాగే తెలుగు ఆడియన్స్ కి ఎటువంటి మ్యాజిక్స్ ఉండాలో అవన్నీ తన మూవీలో ఉండే విధంగా ప్రతి సీన్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఫైనల్ స్కిప్ట్ వైపు పయనిస్తాడు. ఆ విధంగా ఇప్పుడు తను తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీ కూడ అదే హార్డ్ వర్క్ తో ముందుకు వెళుతుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా సినిమా ‘బాహుబలి’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఒకప్పటి రాచరిక సంస్కృతిని, రాజుల వైభోగాలు, దానికి సంబంధించి ప్రతి దాన్ని తన చిత్రంలో చూపించటానికి రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకూ ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ఏకంగా ప్రీ ప్రొడక్షన్ లో జరిగిన వర్క్ ని అంతా ఓ విజువల్ రూపంలో చూపించాడు. చారిత్రాత్మక కోటలను ఆవిష్కరించడానికి కళా దర్శకులు, ప్రీ ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు, కాస్ట్యూమ్ డిజైనర్లు , గ్రాఫిక్ డిజైనర్స్ ఇలా, ఎంత మంది కష్టపడ్డారో అందరి విభాగాలకి సంబంధించిన వీడియోలను తన మేకింగ్ వీడియోలో చూపించాడు. అయితే రాజమౌళి తన మూవీపై జరిగిన ప్రి ప్రొడక్షన్ వీడియోకి చాలా తెలివిగా పేరుని పెట్టాడు. "విజువలింగ్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి" ఈ పేరుతో రాజమౌళి చెప్పే విషయం ఏమిటంటే, బాహుబలి మూవీ అనేది కేవలం సౌత్ మసాలే కాదు, వరల్డ్ వైడ్ మార్కెటింగ్ సంపాదించుకుంటున్న మూవీగా పేరు సంపాందించుకుంటుదనే భావం కలిగి ఉందంటని చిత్ర యూనిట్ నుండి సమాచారం వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిచెప్పటానికి రాజమౌళి తన వంతుగా సిద్ధంగా ఉన్నాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: