టాప్ హీరోలను ఎలాగో అలాగ కాకా పట్టి అవకశాలు కొట్టేయాలి అని ప్రయత్నిస్తున్న హీరోయిన్స్ సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంటే దానికి భిన్నంగా బాలీవుడ్ టాప్ హీరోల అసల రంగును బయట పెట్టిన కత్రినా మాటలు ఇప్పుడు బాలీవుడ్ లో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మంచి మంచి డిజైనర్‌ బట్టలేసుకుని, అదిరిపోయే యాక్ససరీస్‌ వేసుకుని, కాస్ట్‌లీ గాడ్జెట్స్‌తో మనిషంటే ఇలా ఉండాలిరా అని కనిపించే హీరోల అసలు గుట్టు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోతారు అని అంటోంది కత్రినా. తాను ఎంతోమంది టాప్ హీరోలతో నటించిన సాన్నిహిత్యంతో తాను ఈ వాస్తవాలను చెపుతున్నానని కత్రినా అంటోంది. కొందరు టాప్ హీరోలు ఉదయం చాల ఆలస్యంగా నిద్రలేచి స్నానం కూడా చేయకుండా సెట్స్‌కి వచ్చేస్తారని, మరి కొందరు బాడీ స్ప్రే కూడా వాడరని రాత్రంతా తాగేసి అలాగే వచ్చిన వాళ్లనుంచి మందు వాసన వస్తుంటుందని దీనితో వాళ్లతో ఇంటిమేట్‌ సీన్స్‌ చేయాల్సి వచ్చినప్పుడు తాను ఆ హీరోల విచిత్ర ప్రవర్తన వల్ల నరకం చూసాననీ చెపుతోంది కత్రినా. అంతేకాదు పొరపాటున వాళ్ళు దగ్గుతున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చుంటే వారి నోటి నుండి వచ్చే దుర్వాసనతో తాను ఎందుకు నటిగా మారానా అని బాధ కలుగుతోందని అంటూ పేర్లు చెప్పకపోయినా చాలా మంది బాలీవుడ్‌ హీరోలంతే అని అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే దక్షిణాది హీరోలు మాత్రం చాల చక్కగా పద్దతిగా ఉంటారని వారి పక్కన నటిస్తున్నప్పుడు ఎటువంటి కంపులు రావని దక్షిణాది హీరోలందరికీ సర్టిఫికేట్ ఇచ్చేసింది కత్రినా. ఇక కత్రినాకు ఇంతటి ప్రత్యక్ష నరకం చూపెట్టిన హీరోలు ఎవరో మరి..  

మరింత సమాచారం తెలుసుకోండి: