తాను దర్శకత్వం వహించిన ‘ముకుంద’ సినిమాకు మెగా అభిమానుల నుంచి సాధారణ ప్రేక్షకుల నుంచి అసంతృప్తి ఎదురౌతున్నా ఆ విషయాలను పట్టించుకోవడంలేదు శ్రీకాంత్ అడ్డాల. ‘ముకుంద’ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ప్రేమ ఏమిటి అన్న విమర్శలకు సమాధానం ఇస్తూ తన సినిమా కథలోని ప్రేమ సన్నీ వేశాలకు శ్రీకృష్ణుడు, రుక్మిణీల ప్రేమ కథ స్పూర్తి అంటూ వీరిద్దరి మధ్య సాగిన ప్రేమాయణ స్పూర్తితోనే తాను ‘ముకుంద’ లో ప్రేమ భావాలను చిత్రీకరించాను అని అంటున్నాడు. అంతేకాదు పాత కాలంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే పెళ్ళి చేసుకుని అన్యోన్యంగా ఉండేవారు కదా అని ఈనాటి డేటింగ్ చేస్తున్న యువతరాన్ని ప్రశ్నిస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. అదేవిధంగా తాను తీయబోయే కొత్త సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా పేరు ‘బ్రహ్మోత్సవం’ ని అంటూ ఆ సినిమా కూడా మధ్య తరగతి జీవితాలను ప్రతి బింబించే కుటుంబ సినిమా కథ అని అంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక టాప్ హీరో నటించబోతున్నాడని ఆ సినిమా హీరో వివరాలను ఆ సినిమాను తీయబోతున్న నిర్మాణ సంస్థ త్వరలో ప్రకటిస్తుంది అని అంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. శ్రీకాంత్ అడ్డాల మాటలను బట్టి ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి కౌంట్ డౌన్ మొదలైందనే అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: