అందరు అంధులే నటించిన ‘మిణుగురులు’ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటబోతోంది. ఇప్పటికే అనేక చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు రావడమే కాకుండా అనేక అవార్డులు ఈ సినిమాకు ఇప్పటికే వచ్చాయి. ఒక తెలుగు దర్శకుడు ఎటువంటి ఆర్భాటం లేకుండా అత్యంత సహజంగా తీసిన ఈసినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచబోతోంది.  ఈసినిమా త్వరలో జరగబోతున్న 87వ ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంపిక అయింది అని ఈసినిమా దర్శకుడు అయోధ్యకుమార్ చెపుతున్న వార్త తెలుగు సినిమా రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు సంబంధించి అన్ని విభాగాలలోనూ పోటీ పడటం హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు ఈసినిమా స్క్రిప్ట్ ను ఆస్కార్ లైబ్రరీలో ఉంచడానికి ఆస్కార్ ఎకాడమి అడిగినట్లుగా అయోధ్యకుమార్ తెలియచేస్తున్నాడు. అయితే ఇంతటి మంచి సినిమా ప్రదర్శన నిమిత్తం పన్నుమినహాయింపు గురించి ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగినా పట్టించుకోలేదు అని అయోధ్యకుమార్ చెపుతున్న విషయాలను బట్టి మంచి సినిమాలు తెలుగులో తీసినా అవి ఎంతగా ఆదరణ ప్రోత్సాహం లేకుండా పోతున్నాయో మరోసారి రుజువు అవుతోంది.  ఈ సినిమాను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా అయోధ్యకుమార్ తను సొంతంగా ఆస్కార్ పేనల్ కు పంపినట్లు చెపుతున్నాడు. ఇతడి ప్రయత్నo విజయవంతం అయి తెలుగు సినిమా ఖ్యాతి ఆస్కార్ అవార్డులలో కనిపించాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: