టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ బాబు తాను తన తండ్రికి ఇంకా ముందుగా పుట్టి ఉంటే తాను తప్పకుండా శ్రీదేవి పక్కన రొమాన్స్ చేసి ఉండే వాడినని ఆమధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు తనకు శ్రీదేవి పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ అన్న మాటలు శ్రీదేవి దాకా వెళ్ళినట్లున్నాయి ఆమె మహేష్ కోరికను తీర్చబోతోంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేష్ కు అత్తగా నదియా నటిస్తుందని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఈ సినిమాలో నదియా నటించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. దీనితో మహేష్ అత్త పాత్ర కోసం మళ్ళీ హంట్ మొదలైంది అనే వార్తలు ఈమధ్యన తరుచూ వినపడుతున్నాయి. అయితే అనూహ్యంగా ఈ అత్త పాత్ర కోసం శ్రీదేవిని శ్రీదేవిని సంప్రదిస్తున్నారు అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో వినపడుతోంది. శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తరువాత చాలామంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాల విషయంలో గతంలో శ్రీదేవిది సంప్రదించినా ఆమె పెద్దగా ఆ శక్తి చూపలేదు.  అదీ కాకుండా ఆమె కోట్లల్లో పారితోషికాన్ని డిమాండ్ చేసిందని టాక్. ఈ పరిస్థుతులలో శ్రీదేవి నిజంగా మహేష్ బాబుకు అత్తగా కొరటాల శివ సినిమాలో కనిపిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడమే కాకుండా బయ్యర్లలో ఈ సినిమా మార్కెట్ కు సంబంధించి మరింత ఊపు వస్తుంది. ఇంతకీ అతిలోక సుందరి ప్రిన్స్ కోరికను తీరుస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: