ఆమీర్ ఖాన్ 'పీకే' సినిమా ఒక వైపు కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉంటే మరో వైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలిగించమంటూ ఆందోళనలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఈ ఆందోళనలు ఉత్తరాది రాష్ట్రాలలో చాల ఉధృతంగా జరుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. భోపాల్, అహ్మదాబాద్ లోని ‘పీకే' సినిమా ఆడుతున్న పలు థియేటర్లను వీహెచ్ పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు అనే వార్తలు వినపడుతున్నాయి.  ఈ సినిమాలో హిందువుల మనో భావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని ఈ మత సంస్థల ఆరోపణ. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా పై ముస్లింలు కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్‌రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి ఆరోపణలు చేస్తున్నాయి.  ఈ విషయంలో విశ్వహిందు పరిషత్ మరొక అడుగు అడుగు ముందుకువేసి ఈ సినిమాలో ఉన్న కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలిగించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వశాఖకు ఘాటైన ఉత్తరం రాసినట్లుగా వార్తలు ఉన్నాయి. అయితే ఇంత రగడ జరుగుతున్నా ఈ సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని తాము తలగించమని సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లిలీ శాంసన్ ప్రకటించడం ఈ విషయంలో మరో కొసమెరుపు.  అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ‘పీకే’ తన 500 కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: