నందమూరి సింహం బాలకృష్ణకు చాలా కోపం ఎక్కువ. కానీ అటువంటి బాలయ్య కోపాన్ని అనుష్క రెచ్చ కొడుతోంది. ఆమె కావాలని ఆ పని చేయకపోయినా పరిస్థుతులు బాలకృష్ణకు అనుష్క పై కోపాన్ని తెప్పించే విధంగా మారిపోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గుణశేఖర్ ‘రుద్రమదేవి’ మూవీ రిలీజ్ గురించి ఓ క్లారిటీ వచ్చేసింది.

అత్యంత భారీ బడ్జెట్ తో దేశంలో తొలిసారిగా స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో తీసిన ఈ చిత్రాన్ని మార్చి లాస్ట్ వీక్‌లో విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు గుణశేఖర్ తెలిపాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అయితే మార్చి ఆఖరి వారం 28న విడుదల కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న బాలకృష్ణ ‘లయన్’ సినిమాకు ఇది షాకింగ్ న్యూస్ గా మారనున్నది.

గతసంవత్సరం ఇదే తేదీకి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘లెజెండ్’ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ బాలకృష్ణ ‘లయన్’ ను కూడా ఈ సంబత్సరం అదే తేదీకి విడుదల చేద్దాం అనుకుంటున్నారు అని టాక్. అయితే ఈ సినిమా విడుదల తేదీ కంటే ముందుగా ‘రుద్రమదేవి’ విడుదల తేదీ ఖరారు కావడంతో బాలయ్య సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుంది అనుకోవాలి. లేదంటే అనుష్క తో పోటీకి రావాలి బాలయ్య.

ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చి ఫస్ట్ వీక్‌లో ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్‌ జరగనున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాకతీయ వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఎంతో కష్టపడి గుణశేఖర్ పడిన కష్టానికి కలల రూపంగా వస్తున్న ‘రుద్రమదేవి’ ముందు ‘లయన్’ పోటీగా నిలబడుతుందా అన్నదే ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: