అనుష్క టైటిల్ రోల్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ‘గోన గన్నారెడ్డి' పాత్రను అల్లు అర్జున్ పోషించాడు. రుద్రమదేవి భర్త పాత్రలో రానా నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి. ఈ మూవీని మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాతల సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగుజాతి చరిత్ర, సాహసం కళ్లకి కట్టేలా భారీ స్థాయిలో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలిసిందే. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో స్టీరియో స్కోపిక్ 3డిలో నిర్మాణమైన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ త్రీడి టెక్నాలజీ ఖచ్చితంగా ప్రేక్షకులకి అంతర్జాతీయ స్థాయి విజువల్ థ్రిల్ కలిగించబోతోంది. ఆ నమ్మకంతోనే పలు ప్రాంతాల్లోని ఎగ్జిబిటర్లు త్రీడి ప్రదర్శనకు అనుకూలంగా తమ థియేటర్లని సిద్ధం చేసుకోవడానికి ముందుకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ అన్నారు. అయితే ఇక్కడి వరకూ బాగున్నప్పటికీ, తీసెంట్ గా వచ్చిన రెండు భారీ చిత్రాలు లింగా, ఐ మూవీలు తెలుగులో డిజాస్టర్ రిజల్ట్స్ ని చూడటంతో ఈ ఎఫెక్ట్ రుద్రమదేవి మూవీపై పడింది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, రుద్రమదేవి మూవీని భారీ రేట్లకి కొంటానికి ఆసక్తి చూపించటం లేదంట. అంతే కాకుండా మూవీ లాభాలపై, అలాగే నష్టాలపై నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్ మధ్య ఓ అవగాహన అగ్రిమెంట్ ఉంటేనే మూవీని కొంటామని డిస్ట్రిబ్యూటర్స్ క్లియర్ గా చెబుతున్నారు. దీంతో కొన్ని ఏరియాల్లో రుద్రమదేవికి డిస్ట్రిబ్యూటర్స్ కరువైయ్యారు. మొత్తంగా రిలీజ్ నాటికి ఈ సమస్య నుండి గుణశేఖర్ ఏ విధంగా బయటపడతాడో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: