ఈరోజు మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు సందర్భంగా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘కిక్-2’ మూవీ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఈ కిక్ 2’ రవితేజ బ్లాక్ బస్టర్ ‘కిక్’ కు సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఆసినిమా చివరిలో రవితేజ ఇలియనాలకు పుట్టిన కొడుకు రవితేజా లాగే కిక్ కోసం సరదా పడుతున్నట్లుగా చూపెట్టి ఆ సినిమాను ముగించారు.

ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యాక ఏమి చేసాడు అన్నదే ఈ ‘కిక్ 2’ కథ అని తెలుస్తోంది. చాల పరాజయాల తరువాత ఈమధ్యనే వరస పెట్టి వచ్చిన విజయాలతో మంచి కిక్ మీద ఉన్న రవితేజ తన హ్యాట్రిక్ విజయం కోసం చేస్తున్న ఈ సినిమా పై చాల అంచనాలు ఉన్నాయి. 46 ఏళ్లు వయస్సు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్న రవితేజ సినిమాలను ఆదరించే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.

మాస్ సినిమాలకు చిరునామాగా ఉండే ఈయన సినిమాలు ప్రొడ్యూసర్స్ కు మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా టాలీవుడ్ లో ఎదిగిన రావితేజాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

అందుకే వరస పెట్టి వచ్చిన ఆరు సినిమాల పరాజయాల తరువాత కూడా రవితేజ తన ఇమేజ్ ని నిలబెట్టకోగలిగాడు. టాలీవుడ్ మాస్ మహారాజ రావితేజాకు ఎపి హెరాల్డ్ జన్మదిన శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: