టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక బిటౌన్ స్టాండర్ట్ హాట్ హీరో రానా. ప్రస్తుతం రానా తీసుకుంటున్న నిర్ణయాలన్ని, తన ఫిల్మ్ కెరీర్ కి ప్లస్ గా మారుతున్నాయి. రీసెంట్ గా తను బిటౌన్ లో నటించిన బేబి మూవీ, బాక్సాపీస్ వద్ద సక్సస్ ఫుల్ గా ఆడటంతో, రానాకి మరికొన్ని అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బిటౌన్ ఇండస్ట్రీ సైతం రానా కి అవకాశాలు ఇవ్వటానికి ఆసక్తి చూపుతుంది. ఇదిలా ఉంటే రానా, తాజాగా తీసుకున్న నిర్ణయం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రానాకి డైరెక్టర్ గా మారాలని ఉందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ప్రత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కచ్చితంగా ఓ రోజు డైరెక్టర్ అవుతానని, ఓ సినిమా చేస్తానని అన్నాడు. అలాగే నిర్మాతగా కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తానని అన్నాడు. ఇదిలా ఉంటే రానా తెలుగులో ఓ మూవీని డైరెక్ట్ చేయటానికి, కొన్ని కథలను వింటున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే రానా సన్నిహితుల సమాచారం మేరకు, ఒకవేళ డైరెక్టర్ గా మారాలనుకుంటే ముందుగా బిటౌన్ లో ప్రయత్నం చేయి అంటూ సలహాలు ఇస్తున్నారు. దీంతో రానా కూడ అందుకు సరేనంటూ అంగీకారం తెలపినట్టు తెలుస్తుంది. అయితే రానా డైరెక్టర్ గా చేయబోతున్న మూవీ 2016వ సంవత్సరం చివరిలో ఉండొచ్చనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ లోపు తను ఒప్పుకున్న మూవీలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా బిటౌన్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మన తెలుగు హీరో రానికి, బిటౌన్ లోనూ డైరెక్టర్ గా కూడ సత్తా చాటాలని ఆశిద్ధాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: