గత కొద్దిరోజులుగా ఫిలిం నగర్ లో మంచు మనోజ్ పెళ్ళి పై వస్తున్న రూమర్లకు తెర దించాడు మోహన్ బాబు. తన చిన్న కుమారుడు మనోజ్ పెళ్ళికి సంబంధించి అధికారికంగా స్పందించాడు. ‘గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా, అదేంటంటే మా అబ్బాయి మనోజ్ వివాహం నిశ్చయమైంది.’ అని అసలు విషయాన్ని బయట పెట్టాడు మోహన్ బాబు.

‘‘మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్, అదే విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో మా కుటుంబానికి పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్, ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం, ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నా కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ చేసింది’’ అని తన చిన్న కోడలు ప్రణితి వివరాలను బయట పెట్టాడు మోహన్ బాబు.

సినిమాల విషయంలో గత సంవత్సరం మంచు కుటుంబ హీరోల లో ఎవరికీ కలిసి రాక పోయినా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ సంవత్సరంలో వెరైటీ సినిమాలు చేయబోతున్నారు మంచు హీరోలు. త్వరలో జరగబోయే పెళ్ళితో మంచు మనోజ్ కు అదృష్టం కలిసి వచ్చి అతడు కోరుకునే సూపర్ హిట్ అందుతుందని ఆశిద్దాం.

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ ఒక సినిమాను చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. త్వరలో మరో స్టార్ వెడ్డింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో మీడియాకు ఇక అంతా హడావిడియే..

మరింత సమాచారం తెలుసుకోండి: