తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమిచి పెళ్ళి చేసుకున్న రామ్ చరణ్ తన భార్య ఉపాసన కోసం నిన్న ఒక సంచలనం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో చూడ ముచ్చట అయిన జంటగా పేరుగాంచిన వీరు ఇరువురు ఏ ఫంక్షన్ కు వచ్చినా అందంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ మీడియా కెమెరాలకు హాట్ న్యూస్ గా మారుతూ ఉంటారు.

నిన్న ఆదివారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ భవనంలో జరిగిన మెగా ఫ్యాన్స్ మీటింగ్ కు వచ్చిన లుక్ అందర్నీ ఆశ్చర్య పరచింది. తన చేతి పై ఉపాసన ముద్దు పేరుతో ‘ఉప్పి’ అని రాయించుకుని ఆ ఫ్యాన్స్ మీటింగ్ కు వచ్చి హడావిడి చేసాడు.

అయితే ఇది టాటు మాత్రం కాదు. గోరింటాకుతో ‘ఉప్పి’ పేరు రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్న సినిమాలో సమంత ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో దర్శకుడు శ్రీను వైట్ల సూచించిన ఏ పేర్లు రామ్ చరణ్ కు నచ్చక పోవడంతో మరో కొత్త టైటిల్ కోసం ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి . ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళ బోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: