వెండి తెర మన్మధుడు నాగార్జునతో సినిమాలో నటించే అవకాశం వస్తే సామాన్యంగా టాప్ హీరోయిన్స్ కూడా వొదులుకోరు. అయితే తెలుగు అమ్మాయి స్వాతి నాగార్జునకు షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సంబంధించి హాట్ యాంకర్ అనసూయకు పట్టిన అదృష్టం మొట్టమొదట స్వాతి ఇంటి తలుపు తట్టింది అని టాక్.

ఈ సినిమాలో తనకు ఆఫర్ చేసిన పాత్ర స్వభావం పూర్తిగా విన్నాక స్వాతి తనకు పాత్ర బాగా నచ్చినా ఈ సినిమా దర్శకుడు అడిగిన డేట్స్ తన వద్ద లేవని ఆ డేట్స్ లలో తాను ఇప్పటికే ఒప్పుకున్న ఒక మలయాళ సినిమా చేయ వలసి ఉందని వినయంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి.

అయితే స్వాతికి నిజంగా డేట్స్ సమస్య వల్ల ఈ అవకాశాన్నివదులుకుందా లేదంటే తనకు వినిపించిన పాత్ర నచ్చలేదా అనే మాటకు కూడా ఉన్నాయి. అయితే నాగార్జున తీస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్వాతికి ఆఫర్ చేసిన పాత్ర చాల ముఖ్యమైనది అని ఫిలిం యూనిట్ టాక్. అంతేకాదు కేవలం డేట్స్ కుదరక మాత్రమే స్వాతి ఈ అవకాశాన్ని వదులు కుంది అని అంటున్నారు.

దీనితో స్వాతి వద్దు అనుకున్న పాత్ర యాంకర్ అనసూయ ఇంట వాలిందని అంటున్నారు. ఎప్పటి నుంచో సినిమా అవకాశాల గురించి ఎదురు చూస్తున్న అనసూయ అనుకోకుండా తలుపు తట్టిన ఈ అదృష్టాన్ని ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అంగీకరించిందని చెప్పిందని వార్తల హడావిడి వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: