తాను నటించిన ‘ఐ’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కేవలం తన అద్భుతమైన నటనతో ఆ సినిమాకు కలక్షన్స్ వర్షం కురిపించిన విక్రమ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణే్ష్ బాబుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన ‘ఐ’ సినిమా ప్రమోషన్ హడావిడి కూడా పూర్తి కావడంతో విక్రమ్ తన తదుపరి సినిమా విషయం పై దృష్టి పెట్టాడు.

'10 ఎన్రాదుకుల్ల' అనే పేరుతో తీస్తున్న ఒక ధ్రిల్లర్ మూవీలో విక్రమ్ నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక హాస్య పాత్రకు సంపూ బాబును ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి షెడ్యూల్లోనే సంపూ పాల్గొననున్నట్లు టాక్.

సంతానం లాంటి టాప్ కమెడియన్లు ఉన్న కోలీవుడ్ లో పిలిచి సంపూర్ణే్ష్ కు ఒక అవకాశం రావడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా గత వీకెండ్ ముగిసే సరికి ‘ఐ’ అన్ని భాషలలో కలిపి 184 కోట్ల పైగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

గతంలో రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘రోబొ’ కలెక్షన్స్ రికార్డు తరువాత ‘ఐ’ సెకండ్ ప్లేస్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఏకంగా విక్రమ్ సినిమాలో సంపూకు అవకాశం రావడంతో మన టాలీవుడ్ లో కూడా టాప్ హీరోల సినిమాలలో సంపూర్ణే్ష్ కు అవకశాలు ఎక్కువగా వచ్చే చాన్స్ లు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: